Tuesday, February 26, 2013

Madhu (Mohva) Festival in Alligudem village on 25th Feb, 2013


                                                                                                                                                                                                                   మార్చి నెలలో ఇప్ప పూలు రాలతాయి 

 వాటిని సేకరించే ముందు ఇప్ప చెట్టుకు పండుగ చేస్తారు. వారి వద్ద ఉన్న అన్నీ రకాల విత్తనాలను, ఇప్ప సారా, ఇప్ప ఆకులు తీసుకువచ్చిఇప్ప చెట్టు మొదల్లో ఉంచి మొక్కుతారు. ఈ పూజ కార్యక్రమం అంతా గ్రామ పూజారి నిర్వహిస్తారు. ఈ పండుగ అనంతరం గ్రామస్టులందరికి పూలు సేకరించే అర్హత వస్తుంది.కోళ్ళను, ఒక పండిని కోస్తారు. ఎంపిక చేసిన ఇప్ప చెట్టు వద్ద పందిరి ఏర్పాటు చేసి , అదే చెట్టుకు పూజా చేసి, పందిరి పై నుండి మహిళలు తమ ఇళ్ల నుండి చిన్న కుండలలో తెచ్చిన నీళ్ళను పూజారి పై చల్లుతారు. ఆ రకంగా ఆ ప్రదేశంలో తడితో ఏర్పడిన బురదను ఒకరి పై ఒకరు (వరశైనవారు) చల్లు కుంటూ, ఆటలు ఆడుతూ పాటలు పాడుతారు. బురద ఎంత బాగా అయితే అంతా ఎక్కువ ఇప్ప పూలు లభిస్తాయని వీరి నమ్మకం. విత్తనాలను తిరిగి తీసుకువెళ్లి, మరలా భూమి పండుగనాడు తీసుకువస్తారు.ఈ పూల లో అనేక రకాలైన పోషక పదార్ధాలు మరియు ఔషదగుణాలున్నాయి. వీటిని గిరిజనులు కరువు కాటకాలు ఏర్పడినపుడు ఇప్ప పూలను వేపి వాటితో గోంగూర విత్తనాల పొడిని కలిపి ఇప్ప నూనె వాడి లడ్డూలు తయారుచేసుకొని తినేవారు. ప్రస్తుతం ఇప్ప పూలతో సారాయి కాయడం, అమ్మి డబ్బులు పొందడం చేస్తారు. హిందువులు ఈ పూలను పుణ్య క్షేత్రాల వద్ద ప్రసాదం లా కొనుక్కొని తింటారు. శ్రీరామ ప్రసాదంగా బాగా పసిద్ధి ఛేందింది ఈ ఇప్ప పువ్వు.
ఈ సంవత్సరం మేము ఇప్ప పూలను పరిశుభ్రంగా సేకరించి, ఎండబెట్టి నేరుగా మార్కెట్ చేయాలని సంకల్పించడం జరిగింది.






Posted by Picasa

No comments:

Post a Comment