Thursday, May 30, 2013

Grama Sabha



















http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/conduct-of-gram-sabhas-at-regular-inervals-stressed/article4765045.ece


ది. 29.5.2013
            “మన గ్రామంలో V.O (మహిళా గ్రామసంఘం) గత సంవత్సర కాలంగా  సమావేశం కావడం లేదని అదే విధంగా పూర్తి వన సంరక్షణ చేపట్టేందుకు మన గ్రామానికి అప్పగించిన అటవీ ప్రాంతం సరిహద్దులు ఇంకా తెలిజేయలేదని ఇ లాంటి సమస్యలన్నింటిని మనం తీర్చుకొనేందుకు గ్రామస్తులందరు కలసికట్టుగా గ్రామ సభ ద్వారా పరష్కార మార్గాలను కనుక్కొవాలని” శ్రీ. బొగ్గ నారాయణ, బురదగూడెం (హర్వాయిగూడెం) గ్రామ పెద్ద పటేల్ అన్నారు. ఆషా సంస్థ ప్రోత్శాహంతో బుధవారము ఉదయం 10.00 గంటలనుండి 12.00 గంటల వరకు జరిగిన బురదగూడెం గ్రామ సభ ను ఉద్దేశించి గ్రామ పెద్ద పై  విధంగా ఉద్భోదించారు. గ్రామంలోని 38 కుటుంబాలకు సంబంధించి 35 మంది ఈ గ్రామ సభకు హజరైనారు.
            శ్రీ. సయ్యద్. సుభాని, ఆషా సంస్థ కార్యదర్శి PESA 1996 ( ఏజెన్సీ ప్రాంతాలకు పంచాయతీ చట్టం విస్తరణ 1996) చట్టం గురించి విపులంగా గ్రామస్తులకు వివరించారు. గ్రామ సరిహద్దులోని వనరులన్నిటిపైన మరియు గ్రామంలోని పరిపాలన వ్యవస్థ లపైనా పూర్తి అధికారం గ్రామ సభకు ఉంటుందని. తమ గ్రామ (పొలిమేర) సరిహద్దులలోని అన్నీ వనరులపై ఆధిపత్యాన్ని కలిగి ఉండి వాటిని  సంరక్షించుకుంటూ, లబ్ది పొందే బాద్యతను గ్రామస్తులు అందరూ సమిస్టిగా చేపట్టాలని వారు కోరారు. 
 
            హాజరైన గ్రామస్తులందరు కలసి గ్రామ సభకు సహకరించేందుకు 7గురు పురుషులు, 8 మంది మహిళలతో  ఒక  స్టాండింగ్ కమిటీని ఎంపిక చేసుకున్నారు. ఈ స్టాండింగ్ కమిటీ నెల కొకసారి లేదా అత్యవసర సమయంలో 15 రోజులకొకసారి సమావేశమై గ్రామానికి సంబందించిన అన్నీ సాంఘీక, ఆర్ధిక, సామాజిక విషయాలపై సమీక్ష జరిపి గ్రామ సభకు తెలియజేస్తారు. ముఖ్య ప్రతినిధి గా శ్రీ. బొగ్గ. బుచ్చిరాజు ను ఎంపిక చేశారు. అటవీ శాఖ వారు తమకి “సామూహిక అటవీ హక్కు పత్రం” 2009లో  ఇచ్చి యున్నప్పటికి మాకు ఇంత వరకు సరిహద్దులు చూపలేదని మాజీ చైర్ పర్సన్ సభకు తెలియ జేశారు. మాకు కేటాయించిన అటవీ ప్రాంతంలో అనేక రకాలైన ఉసిరి, తాని వగైరా లాంటి కలపేటర అటవీ ఉత్పత్తులు లభ్యమవుతున్నప్పటికి కొనుగోలు చేసేవారు లేనందున అవి వృధాగా కాలీ పోతున్నాయని సమావేశానికి హాజరైన మహిళలు తమ ఆవేదనను వ్యక్త పరిచారు. వన సంరక్షణ సమితి ద్వారా గ్రామానికి కేటాయించిన అటవీ ప్రాంత సర్వే చేసి, సరిహద్దులను ఏర్పాటు చేయాలని అటవీశాఖ వారిని కోరుతూ గ్రామ సభ తీర్మానం చేసింది. అదే విధంగా సమీకృత గిరిజనాభివృధ్హి సంస్థ ప్రతిపాదిస్తున్న పచ్చ తోరణం కార్యక్రమం ద్వారా తమ సంరక్షణలో ఉన్న అటవీ ప్రాంతంలో మొక్కలు నాటే కాయక్రమం చేపట్టాలని తీర్మానం చేయడం జరిగింది.
            ఈ సమావేశమునకు అటవీశాఖ తరపునుండి కుమారి. S. గౌతమి, ఏ‌బి‌ఓ మరియు శ్రీ. అశోక్ , సమన్యకర్త, ఆషా వారు పాల్గొన్నారు.
Posted by Picasa